Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Nanis Tuck Jagadish Gets Postponed

‘టక్ జగదీశ్’ వెనక్కి వెళుతున్నాడు!

Published Date :April 12, 2021 , 11:28 pm
By ramakrishna
‘టక్ జగదీశ్’ వెనక్కి వెళుతున్నాడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నాని హీరోగా నటించిన ‘టక్ జగదీశ్’ మూవీ విడుదల సైతం వాయిదా పడింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఉగాదికి ఈ సినిమా ట్రైలర్ రావడం లేదని, సినిమా కూడా 23 నుండి కాస్తంత వెనక్కి వెళుతోందని స్పష్టం చేశాడు. త్వరలో వచ్చే ట్రైలర్ లోనే సినిమా విడుదల తేదీ ఉంటుందని చెప్పాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతాన్ని అందించాడు. ఉగాది కానుకగా ఈ సినిమా ట్రైలర్, ఈ నెల 23న సినిమా విడుదల కావాల్సి ఉంది. ‘జనవరిలో ‘క్రాక్’తో మొదలు పెట్టి నిన్నటి ‘వకీల్ సాబ్’ వరకూ పలు చిత్రాలను తెలుగు సినిమా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారని, అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత వెనక్కి వెళుతున్నామ’ని నాని తెలిపాడు. రీ-రికార్డింగ్ కూడా బాగా వస్తోందని చెప్పాడు. అందరూ ఉగాది పండగను సేఫ్ గా జరుపుకోవాలంటూ నాని శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటికే ఈ నెల 16న రావాల్సి ఉన్న ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేశారు. ఇప్పుడు 23న రాబోతున్న ‘టక్ జగదీశ్’ సైతం వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ లెక్కన మిగిలిన సినిమాలు సైతం ఇలానే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది.

Hi 🙂 #TuckJagadishPostponed pic.twitter.com/byQwprFTHA

— Nani (@NameisNani) April 12, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nani
  • Tuck Jagadish
  • Tuck Jagadish Postponed

తాజావార్తలు

  • Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

  • Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్

  • Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

  • Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..

  • Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions