భారత్‌లో హిందూవులకు, ముస్లింలకు మధ్య విభేదాలకు కారణమైన విషయాల్లో అయోధ్య ఒకటి. దీంతో చాలా మంది అయోధ్య రాముడిని హిందూవులు మాత్రమే కొలుస్తారని భావిస్తారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. రాముడిని ముస్లింలు కూడా పూజిస్తారు అని చెప్పడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ. వారణాసిలోని రామాలయంలో దీపావళి రోజున అయోధ్య రాముడికి ముస్లింలు హారతి ఇవ్వడం 15 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రతి ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా రాముడికి ముస్లిం మహిళలు హారతి ఇచ్చి ప్రత్యేకంగా పూజలు చేపట్టారు.
Read Also: కోహ్లీ బర్త్‌డే స్పెషల్.. రికార్డుల కింగ్ అంటే ఇతడే..!!
ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ నంజీన్ అన్సారీ మాట్లాడుతూ.. .ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా తాము సంప్రదాయాన్ని పాటించామని, తన చేతుల మీదుగా ఈ పూజ జరగడం తన అదృష్టమని తెలిపింది. ఈ పూజకు ముస్లింలు మాత్రమే కాకుండా హిందూవులు కూడా హాజరయ్యారు. వేదపండితులతో పూజలు నిర్వహించి రాముడి విగ్రహానికి పూలమాలలు వేసి హారతులు పట్టారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి దీపావళి పూజను అయోధ్య రాముడి పేరు మీద ముస్లిం పెద్దలు నిర్వహించారు.
काशी में दीपावली पर मुस्लिम महिलाओं ने उतारी श्रीराम की आरती, ‘सबके राम, सबमें राम’ का दिया संदेश#Diwali2021 #Varanasi #PMNarendraModi pic.twitter.com/jHIczYc143
— Prabhat Khabar UP (@prabhatkhabarup) November 4, 2021