క్రిస్మస్ వేడకులకు గిఫ్ట్‌లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక క్రిస్మస్ వేడుకలకు ముందు నుంచే వివిధ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముందే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి పండుగలకు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. బ్రిటన్‌కు చెందిన డెబ్రా కాంగ్నమ్ అనే మహిళ ఇటీవలే శాంసంగ్ టీవీని 280 పౌండ్లకు కొనుగోలు చేసింది. క్రిస్మస్ కానుకగా తన కూతురుకి ఇవ్వాలని అనుకున్నది. వచ్చిన పార్శిల్‌ను అలానే ఉంచేసింది. వారం తరువాత ఇంట్లో పెంచుకునే చిన్న కుక్కపిల్ల పదేపదే పార్శిల్ వద్దకు వెళ్లి వాసన చూస్తూ మొరగసాగింది. దీంతో ఆ మహిళ టీవీ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాకయింది. టీవీ బాక్స్‌లో టీవీతో పాటుగా ప్యాకెట్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మాంసం కూడా కనిపించింది. దానిపై ఉన్న స్థిక్కరింగ్ ప్రకారం ఆ మాంసం ధర 30 పౌండ్లు. అయితే, చాలా రోజులుగా మాంసం అందులో ఉండిపోవడంతో కుళ్లిపోయింది. కుళ్లిన స్థితిలో ఉన్న మాంసాన్ని చూసి ఆ మహిళ షాక్ అయింది. దీనికి సంబంధించిన పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.