Site icon NTV Telugu

బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్‌ జిల్లాలోని భీంగల్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు.

అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. బీజేపీలో తలకాయ ఉన్నోళ్లు లేనోళ్లు అందరూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదని అభివృద్ధి చేయాలంటే మనసుపెట్టి పని చేయాలని ఆమె అన్నారు. భీంగల్ లో హాస్పిటల్ ని వంద పడకలుగా మారుస్తామని తెలిపారు.

Exit mobile version