NTV Telugu Site icon

మిర్యాలగూడ కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రభస

నల్లగొండలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతోంది. అయితే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఫ్లెక్సీపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ అర్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు.

మిర్యాలగూడ నుండే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలి. రాష్టంలో కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడాలంటే ముందు మిర్యాలగూడ నుండే మొదలవ్వాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, నల్గొండ మాజీ ఎంపీ లు కాంగ్రెస్ నుండి వెళ్లి ప్రతిష్టను దెబ్బతీశారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నా సలహా సూచనలు కచ్చితంగా ఇస్తాను. నల్గొండ పార్లమెంట్ లో మిర్యాలగూడ నుండి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసి మాకు పేరు తీసుకురావాలి. మిర్యాలగూడ నుండి 30 వేలకు పైగా సభ్యత్వం నమోదు చెయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకుంది టీపీసీసీ. నాయకులు సమన్వయంతో ముందుకెళ్ళాలని సీనియర్ నేతలు కార్యకర్తలకు సూచించారు. తాజాగా జానారెడ్డి పెద్దరికంతో వ్యవహరించి కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదాన్ని సమసిపోయేలా చేశారు.