ఎయిర్‌ఫోర్స్ విమానం ఒకటి ఇటీవలే అదృశ్యమైంది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిరాజ్ యుద్దవిమానానికి చెందిన 5 టైర్లను యూపీలోని లఖ్‌నపూలోని బక్షిక తలాబ్ ఎయిర్‌పోర్స్ నుంచి జోథ్‌పూర్ తరలించే క్రమంలో ఈ టైర్ మిస్సయింది. 40 అడుగుల పొడవైన భారీ వాహనంలో ఈ విమానం టైర్లను తలిస్తుండగా టైర్ మిస్సయింది. దీనిపై ట్రక్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, డిసెంబర్ 4 వ తేదీన పోలీసు అధికారులు వాయుసేన కు చెందిన మిస్సైన టైర్‌ను తిరిగి రికవరీచేసి అధికారులకు అప్పగించారు. ఈ టైర్ చోరీ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read: విశాఖలో కుంగిన భూమి… ఆందోళనలో ప్రజలు…
వివరాల ప్రకారం నవంబర్ 26 వ తేదీన లఖ్‌నపూలోని షహీద్‌పాత్ పరిథిలోని సర్వీస్ రోడ్డులో టైర్‌ను గుర్తించిన ఇద్దరు అనుమానితులు దానిని లారీ టైర్‌గా భావించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే, డిసెంబర్ 3 వ తేదీన ఎయిర్ ఫోర్స్ విమానం టైర్ మిస్సయినట్టు టీవీలో వార్తలు రావడంతో ఆ టైర్‌ను పోలీసులకు అప్పగించారు.