విద్యార్ధులపై కోవిడ్ పంజా.. తెలంగాణ సర్కార్ హై అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
Read Also గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులకు కరోనా !
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అశ్రద్ధగా ఉండకూడదన్నారు. శానిటైజర్ లు వాడాలన్నారు. ధర్మ స్క్రీనింగ్ చేయాలని భౌతిక దూరం పాటించాలన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రెండు డోస్ లు టీకా తీసుకోవాలన్నారు. తెలంగాణలో అక్కడక్కడా కోవిడ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కేసులు ఆందోళన కలిగించాయి.
ఇక్కడి గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ పాఠశాలలో ఏకంగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే… నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 43 మంది విద్యార్థులు, ఒక లేడీ లెక్చరర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా మహమ్మారి సోకిన వారిని పాఠశాలలోనే ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. ప్రస్తుతం… కరోనా సోకిన ఆ విద్యార్థులకు… వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్ధులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!