రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. పరకాల, నడికూడ, రేగొండ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నిరంజన్ రెడ్డి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లు మాట్లాడారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. నేలరాలిన మిర్చిపంటలను మంత్రులకు చూపిస్తూ.. సర్వం నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. తమను ఆదుకోవాలని మహిళా రైతులు మంత్రి కాళ్లపై పడడం అక్కడివారిని కలిచివేసింది.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటల దెబ్బతిన్నాయన్నారు. రైతులు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. చేతికొచ్చిన మిరప నేలరాలిందని, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లో మిర్చి దెబ్బతిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంటనష్టం పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నామన్నారు. రైతులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామన్నారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!