NTV Telugu Site icon

రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు.. అప్పట్లో చంద్రబాబుకి కూడా చెప్పా..!

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది… మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. మల్లారెడ్డికి కాదు.. సీఎం కేసీఆర్‌కే నా సవాల్.. అసెంబ్లీ రద్దు చేసి రావాలి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించాడు రేవంత్‌రెడ్డి.. ఇక, అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు.. అయితే, తాజాగా రేవంత్‌రెడ్డికి కౌంటర్‌ ఇస్తూనే.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.. తాను ఎంపీ అయినప్పట్టి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. టీడీపీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నాడని.. అప్పట్లో ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.

ఇక, నేను రాజీనామా చేసిన సవాల్ ను రేవంత్ ఎందుకు తీసుకులేదు? అని ప్రశ్నించిన మంత్రి మల్లారెడ్డి.. నీ కోసం సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలా రేవంత్ ? అని మండిపడ్డారు.. నీకు దమ్ము ఉంటే హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు తెచ్చుకో అని కొత్త సవాల్‌ చేశారు.. ఇక, రేవంత్ అబద్ధం ఆడితే… అతికేటట్లు ఉండాలి.. ఏవో పేపర్లు చూపి డ్యామేజ్ చేస్తే అయిపోతుందా ? జవహర్ నగర్ లో గవర్న మెంట్ స్థలంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు.. కానీ, సౌకర్యాలు లేకుండే.. నేను కల్పించానన్నారు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 330 ఎకరాల్లో జీవో తీసి ఇచ్చారు… పేద ప్రజల కోసం ..కట్టిన ఇళ్లకు క్రమబద్ధీకరణ చేశారన్నారు.. జవహర్ నగర్ లో నా కోడలు పేరు మీద 350 గజాల స్థలం ఉంది …ట్యాక్స్ కడుతున్నాము .. ఎన్‌వోసీ ఉంది… సేల్ డిడ్ ఉంది అన్నారు.. మాకు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. గత ఏడాది సెప్టెంబర్ 9 న ఆస్పత్రి ప్రారంభించానని తెలిపారు. నా కాలేజీలపై పార్లమెంట్ లో రేవంత్ ప్రశ్న అడిగారు… అంతా బాగుంది అని కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు మల్లారెడ్డి.. డిఫెన్స్ కమిటీ మీటింగ్ లో బంగ్లాలు… ఫంక్షన్‌ హాల్ ల గురించి రేవంత్ అడుగుతున్నారట.. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? అంటూ ఎద్దేవా చేశారు.

మరోవైపు ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను, మంత్రులను తిడుతుంటే చూస్తూ ఉండాలా? అని ప్రశ్నించారు మల్లారెడ్డి.. బండి సంజయ్, రేవంత్ మమ్మల్ని తిడితే ప్రజలు తోలు తీస్తారని హెచ్చరించిన ఆయన.. మల్లా రెడ్డి యూనివర్సిటీకి 21 ఎకరాలు పెట్టాం… నా సమాధానం రేవంత్ కు కాదు… తెలంగాణ ప్రజలకే అన్నారు.. నేను చెప్పిన నాకు 6 వందల ఎకరాల ఉందని.. అందులో 400 ఎకరాల కాలేజీల పేరుతో ఉందన్నారు.. వాటికి రైతు బంధు వస్తుందా? అని ప్రశ్నించారు. నాకు నాలుగు సొసైటీలు ఉన్నాయి… అన్నింటికి అన్ని అనుమతులు ఉన్నాయి.. నేను పాలు అమ్మిన, పూలు అమ్మిన… నేను అభివృద్ధి చెందిన.. రేవంత్ ఏమి చేసి అభివృద్ధి చెందాడు ? ఏం చేస్తే వచ్చేయో చెప్పాలని డిమాండ్‌ చేశాడు.. రేవంత్ మర్యాద ఇవ్వడం నేర్చుకో… నీకు మర్యాద దక్కుతుందని సూచించిన ఆయన.. రేవంత్ ఇప్పటికీ అయిన జాగ్రత్తగా ఉండు.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.. మల్లారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..