Site icon NTV Telugu

Brahmotsavam: భద్రాద్రిలో రాములోరి కల్యాణం.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

Kcr Badrachalam

Kcr Badrachalam

శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు ఆహ్వానం అందింది. బుధవారం ప్రగతి భవన్ లో దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆలయ ఈవోతో కలిసి ఆహ్వాన పత్రికను సీఎం కేసీఆర్ దంపతులకు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
Also Read: Extramarital Affair: భర్తని వదిలి ప్రియునితో కాపురం.. కట్ చేస్తే ఊహించని దారుణం

మరోవైపు భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు విశేషాభిషేకం అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాలకు ఓంకార ధ్వజ ఆరోహణ, విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం, రక్షా సూత్రముల పూజ, రక్షాబంధనం, రుత్విక వరణం కార్యక్రమాలను పూజారులు నిర్వహించారు.

Also Read: Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ.. ఆ విధ్వంసకర బ్యాటర్ దూరం

Exit mobile version