NTV Telugu Site icon

Actor Innocent: సినీ ఇండస్ట్రీలో విషాదం… నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత

Inno

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖ నటులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ మలయాళ సినీ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మరణించారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గతకొద్ది రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడంతోపాటు శ్వాసకోశ వ్యాధులు, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Also Read:Sri Shiva Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు తొలగిపోతాయి

ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడేళ్ల తర్వాత, అతను ఆ వ్యాధిని అధిగమించానని ప్రకటించాడు. క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తన పుస్తకం ‘లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్’లో రాశాడు. నటుడు ఇన్నోసెంట్​లోక్​సభ ఎంపీగా కూడా సేవలందించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఇన్నోసెంట్ తన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రజల హృదయాలను కొల్లగొట్టారని కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఇన్నోసెంట్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడని కొనియాడారు.

రాజకీయాల్లోనూ ఇన్నోసెంట్​ చాలా చురుగ్గా ఉండేవారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇన్నోసెంట్​ త్రిసూర్ జిల్లాలోని చలకుడి నియోజకవర్గం నుంచి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2014-2019 వరకు లోక్​సభ ఎంపీగా కూడా సేవలందించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బెన్నీ బెహనాన్ చేతిలో ఓడిపోయారు.

Also Read:TSRTC: రోడ్డెక్కుతున్న లహరి బస్సులు.. అదిరిపోయే ప్రత్యేకలు ఇవే..

1948లో ఇన్రింజలకుడలో జన్మించిన ఇన్నోసెంట్ 1972లో ప్రేమ్ నజీర్, జయభారతి జంటగా నటించిన ‘నృత్యశాల’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అతను వరుసగా 12 సంవత్సరాలు మలయాళ కళాకారుల సంఘం అయిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రముఖ నటుడు, హాస్యనటుడిగా ప్రేమగా గుర్తుంచుకుంటారు. నాలుగు దశాబ్దాలు పాటు నటించిన ఆయన.. దాదాపు 500 చిత్రాలకు పైగా నటించారు. ఆయన చివరిసారిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువ’లో కనిపించారు. ఈ చిత్రం 2022లో విడుదలైంది.