బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ది ఉందా? రేవంత్ ఫైర్

తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ కి కేంద్రం ఆమోదం తో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు రేవంత్.

స్థానికత కోల్పోకుండా ఉద్యోగ కల్పన ఉండాలి. నాలుగు లక్షల మంది ఉద్యోగులలో చిచ్చు పెట్టారు. ఉద్యోగుల్లో కొందరిని తన వైపు తిప్పుకునే ఆలోచన లో నే జీఓ 317 వుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్న ఉద్యోగుల్లో చీలిక తెచ్చి…ఒక వర్గాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. బండి సంజయ్..క్యాంప్ ఆఫీస్ దీక్ష చేస్తారు అంటారు. జాగరణ అంటే.. నైట్ క్యాంప్ ఆఫీస్ లో పడుకుని పొద్దుగాల ఇంటికి పోతా అన్నాడు. అదేదో పెద్ద సమస్య అన్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వం కట్టర్లు.. గ్యాస్ ప్రయోగించింది.

అరెస్ట్ చేసి 48 గంటల్లో సమస్య ముగిసింది. బీజేపీ నేతలు గంగిరెద్దుల వాళ్ళు లెక్క వచ్చిపోతున్నారు. కార్గిల్ వీరున్ని ముద్దాడినట్టు సంజయ్ ని బీజేపీ ముఖ్యమంత్రులు ముద్దాడుతున్నారు. బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ది ఉందా? రాష్ట్రం పంపిన నివేదిక కు కేంద్రమే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించింది మీరే కదా. రాష్ట్రం పంపిన నివేదిక తప్పు అయితే…..కేంద్ర మంత్రి వర్గం ఎలా ఆమోదం పలికిందన్నారు రేవంత్.

కెసిఆర్ తప్పు చేస్తే…దానికి మద్దతు చెప్పింది బీజేపీ. కేంద్ర ఆదేశాలు వెనక్కి తీసుకోవచ్చు కదా. జోనల్ విధానం అంతా కేంద్రం చేతిలోనే ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో కెసిఆర్ నిర్ణయాన్ని గుడ్డిగా ఆమోదం తెలిపిన కిషన్ రెడ్డీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బండి..గుండు..ఇద్దరు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్నప్పుడే జీఓ 317 పై న్యాయం చేయట్లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారా..? లెఫ్ట్ నేతలను కెసిఆర్ ఇంటికి పిలిచి డ్రామాలు మొదలు పెట్టారు. కెసిఆర్ బీజేపీ పంజరంలో చిలుక అన్నారు. బీజేపీ మాటలే కెసిఆర్ పలుకుతారు.

మోడీ ఆదేశాలతోనే కెసిఆర్ మాట్లాడుతున్నారు. బీజేపీ..కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కూటమి కట్టాలని కెసిఆర్ కి ఉంటే జగన్ తో మాట్లాడారా. ఎస్పీని కలిశావా.. నవీన్ పట్నాయక్ నీ కలిశావా..? యూపీయేలో ఉన్న డీఎంకే..శరద్‌ పవార్‌ నే కలుస్తున్నారు. యూపీయేకి దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేసే పనిలో ఉంది. కెసిఆర్ సుఫారీ చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ లో కెసిఆర్.. సమాజ్ వాదీ పార్టీ కి మద్దతు ఇస్తాడా .? లెఫ్ట్ పార్టీ లు యూపీలో అఖిలేష్ కి మద్దతు ఇస్తున్నాయి. కెసిఆర్ మోడీ షేర్వాణి లో గులాబీ కాకపోతే … యూపీ లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతు పలుకుతావా..? అఖిలేష్ కి ప్రచారం చేస్తావా..? అందుకు సిద్ధంగా ఉన్నావా..?బీజేపీ..టీఆర్‌ఎస్‌ ఉమ్మడి డ్రామాలు ఆడి జనాన్ని మభ్యపెడుతున్నారని రేవంత్ విమర్శించారు.

Related Articles

Latest Articles