మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించినట్టు ప్రకటించారు.. కాగా, ఇప్పటికే మా ఎన్నికల్లో పోలింగ్ కొత్త రికార్డును సృష్టించాయి… మధ్యాహ్నం 2 గంటల వరకు 580 మంది నటీనటులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. దీంతో రికార్డు స్థాయిలో 56 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఉండగా.. 3 గంటల లోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకున్నవారికి ఓటుహక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించనున్నారు.. దీంతో.. పోలింగ్ ముగిసేసరికే సాయంత్రం 4 కావచ్చు అని అంటున్నారు ఎన్నికల అధికారులు.