పాటల పుట్ట… భాస్కరభట్ల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 5న భాస్కరభట్ల పుట్టినరోజు)
నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ పాటలతో ఆడేసుకుంటున్నారు భాస్కరభట్ల. తెలుగు పలుకులకు పరభాషా పదాలను అనువుగా తొడిగి పాటలు ఒలికించడంలో మేటి భాస్కరభట్ల. ఆ బాణీ అంటే ఎందరికో ఇష్టం. అందువల్లే కొందరు దర్శకులు తాము రూపొందించే చిత్రాలలో అదేపనిగా భాస్కరభట్ల పాటలకు చోటు కల్పిస్తూ ఉంటారు. వారందరికీ ఆనందం పంచుతూనే భాస్కరభట్ల కలం సాగుతూ ఉంది.
అర్చకత్వం ఉన్న కుటుంబంలో జన్మించిన భాస్కరభట్ల రవికుమార్ కు బాల్యంలోనే తెలుగు సాహిత్యంపై అభిమానం కలిగింది. అదే ఆయనను వార్తలు రాసేందుకు పురమాయించింది. దాంతోనే ‘ఈనాడు’ కాంపౌండ్ లోని సితార సినిమా మేగజైన్ లో ఫిలిమ్ జర్నలిస్ట్ గా మారారు. కొన్నేళ్ళు అక్కడ పనిచేసిన తరువాత ఇది కాదు నా గమ్యం అని తీర్మానించుకున్నారు రవి. దాంతో సితార సినిమా జర్నలిస్ట్ ఉద్యోగానికి బై బై చెప్పేసి, చిత్రసీమలో గీతరచయితగా ప్రయత్నాలు మొదలెట్టారు. తొలి రోజుల్లోనే చక్రి వంటి సంగీత దర్శకుడు, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు భాస్కరభట్లను ప్రోత్సహించారు. వారి సినిమాలతోనే భాస్కరభట్ల పాటలకు భలేగా గుర్తింపు లభించింది. “రామసక్కని బంగారు బొమ్మా… రాసలీలకు వస్తావా…” అంటూ కవ్వించాడు. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…” అని పలికించి బులిపించాడు. “చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా…” అని ఉడికించాడు. “లేలేత నవ్వులా… పింగాణి బొమ్మలా…” అంటూ మురిపించాడు. “గాల్లో తేలినట్టుందే… గుండె పేలినట్టుందే…” అనేసి ప్రేమికుల నరాలు జివ్వు మనిపించాడు. “కృష్ణానగరే మామా… కృష్ణానగరే…” పాటలో నవ్వుల మాటున దాగిన సినీజీవుల కన్నీటి గాథలను ఒలికించాడు. ఇలా ఏది చేసినా భాస్కరభట్ల పాటల్లో పైకి వినిపించే పదాల మాటున దాగిన అర్థం కొన్నిసార్లు పెదాలను తడిచేయిస్తుంది. మరికొన్ని సార్లు మనసులనూ తడిచేస్తుంది. ఇప్పటికే వందలాది పాటలతో సందడి చేసిన భాస్కరభట్ల పాటకు ఇప్పటికీ ఎందరో సినీజనం పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు. కమర్షియల్ లిరిసిస్ట్ గా భాస్కరభట్ల సక్సెస్ రూటులో సాగిపోతున్నారు. ఆయన పాటకు తగ్గ ప్రభుత్వ అవార్డులే ఇంకా దరి చేరలేదు. ఈ పుట్టినరోజు తరువాతయినా భాస్కరభట్లకు ఆ లోటు తీరాలని ఆశిద్దాం.
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!