‘పుష్ప’ రిలీజ్ ‘అప్పుడే’ అంటోన్న టాలెంటెడ్ స్టార్ హీరో…

తెలుగు వారితో బాటూ దేశంలోని చాలా మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. అందుక్కారణం భారీగా తీస్తోన్న ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాలో పలు భాషలకు చెందిన నటులు, టెక్నీషియన్స్ ఉండటం! ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాదు, ‘పుష్ప’ మూవీనే ఆయనకు టాలివుడ్ డెబ్యూ అవ్వనుంది!

మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే మలయాళ, తమిళ రంగాల్లో గుర్తింపు పొందాడు ఫాహద్. అయితే, ఆయన ‘పుష్ప’లో చేస్తోన్న క్యారెక్టర్ ఏంటనేది ఇంకా సస్పెన్సే. లాక్ డౌన్ వల్ల షెడ్యూల్స్ డిస్టబ్ కావటంతో అతను సెట్స్ మీదకు రాలేదు. ఆల్రెడీ కొనసాగుతోన్న ‘పుష్ప’ షూటింగ్ లో ఫాహద్ ఆగస్ట్ లో జాయినవుతాడట. ఓ ఫిల్మీ పోర్టల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పుష్ప’ రిలీజ్ గురించి కాస్త హింట్ ఇవ్వటం విశేషం….

Read Also : ముంబైలో రామ్ చరణ్ బీచ్ సైడ్ హౌజ్… గృహ ప్రవేశం కూడా…!!?

హీరో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, దర్శకుడు సుకుమార్ ‘రంగంస్థలం’ తరువాత చేస్తోన్న ‘పుష్ప’ సహజంగానే ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరికీ ఆసక్తిగా ఉంది. అయితే, కరోనా తెచ్చిపెడుతోన్న లాక్ డౌన్స్ వల్ల తీవ్రంగా ఆలస్యమవుతోంది. అయితే, ఫాహద్ ఫాసిల్ చెబుతోన్న దాని ప్రకారం ఈ సంవత్సరం చివరికల్లా మన పుష్పరాజ్ అడవి లోంచి థియేటర్స్ కు రావచ్చట! అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదీ నిర్దిష్టంగా చెప్పలేం కాబట్టి, 2022 ప్రారంభంలో రిలీజైనా అవ్వచ్చునట! చూడాలి మరి, బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఇంకా ఎంత కాలం కొనసాగాలో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-