NTV Telugu Site icon

Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..

Ladakh Bandh

Ladakh Bandh

ఆధ్యాత్మిక గురువు దలైలామా ఒక అబ్బాయిని ముద్దుపెట్టుకుంటూ, తన నాలుకను నోటితో తాకాలని బాలుడిని కోరిన వీడియో అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, సోమవారం లడఖ్ లో స్థానికలు దలైలామాకు మద్దతునిచ్చేందుకు శాంతి మార్చ్‌ను చేపట్టారు. వైరల్ వీడియోపై లడఖ్ బౌద్ధ సంఘం (ఎల్‌బిఎ), లడఖ్ గుంపా అసోసియేషన్ (ఎల్‌జిఎ) సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆధ్యాత్మిక నాయకుడి ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేశారని ఆరోపించారు. కార్గిల్‌లోని పలువురు ప్రముఖ ముస్లిం నాయకులు కూడా పవిత్ర దలైలామా పరువు తీయడంలో మునిగి తేలుతున్నారని విమర్శించారు.
Also Read:CM Jagan Lawyer : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కరెక్టుగా విచారణ జరుపలేదు..

లేహ్, కార్గిల్‌తో సహా పలు ప్రాంతంలోని అన్ని ప్రధాన పట్టణాలలో శాంతియుత నిరసన ప్రదర్శనలు జరిగాయి. దలైలామా ప్రతిమను కించపరిచిన వారు క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. లడఖ్ బౌద్ధ సంఘం అధ్యక్షుడు థుప్‌స్తాన్ ఛెవాంగ్ మాట్లాడుతూ, అత్యవసర సేవలు మరియు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైనా ఉంటే, ఎవరికీ ఇబ్బంది ఉండదు అని తెలిపారు. అలాగే, ప్రభుత్వ అధికారులతో సహా ప్రతి ఒక్కరూ నిరసనను పాటించాలని ఆయన అభ్యర్థించారు. బంద్‌ పిలుపుతో బోర్డు పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. వాహనాలు రోడ్డెక్కకుండా ఉంటాయని తెలిపారు. బౌద్ధులు దలైలామాను తమ దేవుడిగా భావిస్తారని, ఆయనను కించపరిచే ఇలాంటి ప్రయత్నాలను సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read:Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు

కాగా, లడఖ్ బౌద్ధ సంఘం (LBA), లడఖ్ గుంపా అసోసియేషన్ (LGA), టిబెటన్ సంఘం ఆధ్వర్యంలో శనివారం లేహ్‌లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కుట్రపూరితంగా దలైలామాకు సంబంధించిన డాక్టరేడ్ వీడియోను ఆయన పరువు తీయడానికి వాడుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. బౌద్ధమతం యొక్క బోధనలు శాంతి, అహింస సూత్రాలపై ఆధారపడి ఉన్నాయని లడఖ్ ఎంపీ, జమ్యాంగ్ త్సెరింగ్ నమ్‌గ్యాల్ అన్నారు. అటువంటి సూత్రాలలో నిరాధారమైన ఆరోపణలకు చోటు లేదని మనం గుర్తుంచుకోవాలన్నారు. ఆయన పవిత్రతపై నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ఆరోపణలు చేయడం చాలా దారుణమన్నారు. టిబెటన్ చిల్డ్రన్ విలేజ్‌కు చెందిన లడఖీ పూర్వ విద్యార్థుల అధ్యక్షురాలు సోనమ్ చోన్జోమ్ కూడా దలైలామా పరువు తీసే ప్రయత్నాలను ఒక ప్రకటనలో విమర్శించారు.

Show comments