ఎవరైనా కష్టంలో వుంటే వెంటనే స్పందించే మంచి మనసు మంత్రి కేటీఆర్ స్వంతం. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవతను, సేవాగుణాన్ని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండాకు 15 లక్షల సాయం అందించారు. తన కుటుంబ సభ్యులతో కేటీఆర్‌ను ఆమె కలిశారు. చెస్ పోటీల కోసం సిద్ధమయ్యేందుకు ఉపయోగపడే విధంగా ల్యాప్‌టాప్‌ను కూడా కేటీఆర్ బహుమతిగా అందించారు. మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్‌కు మలికాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
మలికా హండా.. బధిర చెస్ ప్లేయర్. పంజాబ్‌కు చెందిన మలిక పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతోంది. తన ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపించింది. ఆమె ఇప్పటివరకూ ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు గెలుచుకుంది. అంతేకాదు జాతీయ బధిర చెస్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఏడుసార్లు పసిడి పతకం కైవసం చేసుకోవడం విశేషం. స్వంత రాష్ట్రం పంజాబ్ పట్టించుకోవడం లేదని ట్వీట్ చేసింది. దీంతో తెలంగాణ మలికను అక్కున చేర్చుకుంది. తన దృష్టికి వచ్చిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. మలికకు సంబంధించి వివరాలు అందుకున్న కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసిన మలికను అభినందించి సాయం అందించారు. ఈ సందర్భంగా మలిక కుటుంబసభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Kept my promise to help the talented @MalikaHanda Ji
— KTR (@KTRTRS) January 10, 2022
Met her today & extended financial support of ₹15 lakhs (in personal capacity) & gifted her a laptop which will help her in preparation for future championships
Request Sports Minister @ianuragthakur Ji to get her a Govt job pic.twitter.com/2j126WVY1b