తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ అసహానం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. నా కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు.
మిమ్మల్ని విమర్శించడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు, వారు మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని మీకు తెలుసు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మనం చేయగలిగినది సున్నితంగా మరియు బాధ్యతాయుతంగా ఉండటం.
ద్వేషం మరియు అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కొంతమంది చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గుచేటు.
-కవిత కల్వకుంట్ల