భక్తి టీవీ కోటి దీపోత్సవం.. జ్వాలాతోరణం రమణీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయ జయ శంకర… శివ శివ శంకర… శంభో శంకర.. హర హర మహాదేవ.. శివ శివ శంకర.. హరహర శంకర అంటూ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మారుమోగిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈనెల 12వ తేదీన ప్రారంభమయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా సాగిపోతోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా భక్తిటీవీ కోటి దీపోత్సవం నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు జ్వాలాతోరణం వీక్షిస్తూ పరవశించారు. నిండుపున్నమి వెలుగులో శ్రీశైల మల్లన్న కల్యాణం కమనీయంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీవిశ్వ ప్రసన్నతీర్థస్వామి పెజావర్ అధోక్షజ మఠం, ఉడిపి, శ్రీవిద్యాప్రసన్న తీర్థస్వామి, సుబ్రహ్మణ్య మఠం, కుక్కే, శ్రీ రఘువరేంద్రతీర్థస్వామి మధ్యమూల సంస్థానం, కర్నాటక స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనాలు అందించారు. ఉజ్జయిని శివలింగానికి భస్మహారతి, బిల్వార్చన కావించారు. శివలింగాలకు వేలాదిమంది భక్తులే బిల్వార్చన చేశారు. అనంతరం నేత్రపర్వంగా శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి కల్యాణం నిర్వహించారు. ఈ వేడుక చూడడానికి వేలాదిమంది తరలివచ్చారు. తదుపరి నందివాహన సేవ, జ్వాలాతోరణం నిర్వహించారు. వేదికపై ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులు కార్తీక దీపారాధన చేశారు.
Also Read
తాజావార్తలు
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!