8వ రోజు : కార్తీకపౌర్ణమి వేళ.. కైలాసనాథుడి కళ్యాణోత్సవం..
భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుక ఈ సంవత్సరం కూడా భక్తకోటిని ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తుతోంది. నవంబర్ 12వ తేదిన అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవ వేడుక నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచనామృతం.
అనంతరం మొట్టమొదటిసారిగా ఉజ్జయిని అర్చకులచే మహాకాళేశ్వర భస్మహారతి, బిల్వార్చన కార్యక్రమం వేదికపైనే కాకుండా భక్తులచే కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత కైలాసాధీశుడు శ్రీశైల మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. అనంతరం నందివాహనంపై స్వామివార్లను భక్తులను ఆశీర్వదించేందుకు కోటి దీపోత్సవ వేదిక ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.
Also Read
జ్వాలాతోరణ మహోత్సవ అపూర్వఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వెనువెంటనే భక్తులచే దీపార్చన కార్యక్రమం కోటిదీపోత్సవ కార్యక్రమానికే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక స్వర్ణ లింగోద్భవ సన్నివేశం కార్తీకపున్నమి వెలుగుల్లో కన్నులారా చూసి తరించాల్సిందే. స్వామి వారికి నివేదించే నాగ, నంది, నక్షత్ర, కుంభ, బిల్వ, సింహా, రుద్ర హారతులను చూసి పుణ్యం పొందడమే తప్పా వర్ణించలేం.
ఆద్యంతం ఆ లయకారుడి వైభవాన్ని చూడాలంటే కోటి దీపోత్సవం కార్యక్రమానికి వెళ్లాల్సిందే.. ఈ రోజు సాయంత్రం 6గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో.. వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్య కలదు. 7వ రోజు కోటి దీపోత్సవంలో ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరుడి కళ్యాణోత్సవం హైలెట్స్ కింది వీడియోలో వీక్షించండి.
తాజావార్తలు
-
Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
-
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?