Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- భక్తులతో కిక్కిరిసిన ప్రాంగణం
- స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు
- వైభవంగా శ్వేతార్క గణపతి కల్యాణం
- మూషిక వాహన సేవతో ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం 2026’ ఐదో రోజు కార్యక్రమాలు అశేష భక్తజనసందోహం నడుమ కనులపండువగా ముగిశాయి. కార్తీక శుద్ధ నవమి సందర్భంగా నవంబర్ 18వ తేదీ బుధవారం నాడు నిర్వహించిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక, ధార్మిక వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పే ఈ దివ్య వేడుకల్లో భాగంగా నేడు నిర్వహించిన పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్వామీజీల అనుగ్రహ భాషణం.. ఆధ్యాత్మిక ప్రవచనామృతం
నేటి వేడుకల్లో భాగంగా వేర్పేడు శ్రీవ్యాసాశ్రమానికి చెందిన శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీ అసంగానందగిరి స్వామీజీ విచ్చేసి భక్తులకు అమూల్యమైన అనుగ్రహ భాషణం అందించారు. వారి దివ్యోపన్యాసంతో ప్రాంగమంతా ఆధ్యాత్మిక భావాలతో నిండిపోయింది. అలాగే ప్రముఖ విద్వాంసులు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి అందించిన ప్రవచనామృతం భక్తులకు చక్కటి ఆధ్యాత్మిక స్పూర్తిని అందించింది. కార్తీక మాస మహాత్యాన్ని, భక్తి మార్గ ప్రాముఖ్యతను వారు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
- Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
- Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
- Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
కోటిగరికార్చన , కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం
ఉత్సవాల్లో భాగంగా వేదికపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెజిమెంటల్ మహోగణపతికి వైభవంగా కోటిగరికార్చన చేపట్టారు. అలాగే భక్తులందరిచే గణపతి విగ్రహాలకు కోటిగరికార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక నేటి వేడుకలన్నింటిలోనూ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి కల్యాణం’ నేత్రపర్వంగా సాగింది. ఈ దివ్య ఘట్టాన్ని కళ్లారా వీక్షించిన భక్తులు తరించిపోయారు. ఈ రోజు కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి తంగిరాల మాధవి దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కనులపండువగా స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు
సాయంత్రం వేళ కోటి దీపోత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వర్ణలింగోద్భవం, సప్తహారతుల కార్యక్రమం ప్రాంగణాన్ని ద్యుతిమంతం చేసింది. భక్తిశ్రద్ధలతో కనులవిందుగా సాగిన ఈ హారతుల కార్యక్రమం భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.
మూషిక వాహన సేవతో ముగిసిన ఐదో రోజు వేడుకలు
చివరిగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన మూషిక వాహనంపై స్వామివారి సేవ అత్యంత రమణీయంగా నిర్వహించబడింది. కార్తీక మాస పవిత్రతను ప్రతిబింబించేలా సాగిన ఈ కోటి దీపోత్సవ ఐదో రోజు కార్యక్రమాలు అశేష భక్తుల జయధ్వనుల మధ్య ప్రశాంతంగా, ఘనంగా ముగిశాయి. రానున్న రోజుల్లోనూ జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కోరారు.
Pics from Day-5 of #Kotideepotsavam2026
#BhakthiTV #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/Cvf0E3POnh
— BhakthiTV (@BhakthiTVorg) November 18, 2026
ఇంతటి మహత్తర ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ వారు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారో..?
#SriKakunuriSuryanarayanaMurthy #BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/2RckW8ivHC
— BhakthiTV (@BhakthiTVorg) November 18, 2026
రేజింతల్ మహాగణపతికి కోటిగరికార్చనలో “మహా సంకల్పం”
#Telangana #BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/ki0p0S2IUF
— BhakthiTV (@BhakthiTVorg) November 18, 2026
కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి కల్యాణంలో “యజ్ఞోపవీత ధారణ”
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/oZl6gpnWFr
— BhakthiTV (@BhakthiTVorg) November 18, 2026
కోటిదీపోత్సవం-2026 5వ రోజు ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలో మధ్యలో ఉన్న బంగారు శివలింగం వద్ద 108 మందిచే పంచహారతులు..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/HAou3MwPjp
— BhakthiTV (@BhakthiTVorg) November 18, 2026
కోటిదీపోత్సవం-2026 5వ రోజు ఉత్సవంలో భాగంగా స్వర్ణలింగోద్భవం.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/laIz1C6VxM
— BhakthiTV (@BhakthiTVorg) November 18, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..