Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
- అమ్మవార్లకు కోటి కుంకుమార్చన
- వైభవంగా భద్రకాళీశ్వరుల కల్యాణం
- సింహ వాహనంపై స్వామివారి సేవ
- పీఠాధిపతుల అనుగ్రహ భాషణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవం ‘కోటి దీపోత్సవం-2026’ నాలుగో రోజు వేడుకలు మంగళవారం (నవంబర్ 17) నాడు అత్యంత వైభవంగా ముగిశాయి. కార్తీక మంగళవారం, గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన నేటి కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివ నామస్మరణతో మార్మోగాయి. కైలాసాన్ని తలపించే సభావేదికపై సాగిన విశేష పూజలు, అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, కల్యాణోత్సవం, వాహన సేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
అమ్మవార్లకు కోటి కుంకుమార్చన.. మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం
నాలుగో రోజు వేడుకల్లో భాగంగా వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదే సమయంలో ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరూ స్వయంగా ఆచరించి తరించేలా దుర్గా విగ్రహాలకు ‘కోటి కుంకుమార్చన’ జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తులంతా ఏకకాలంలో చేసిన ఈ విశేష పూజ కనులపండువగా సాగింది.
Also Read
- Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
- Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
- Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణోత్సవం.. సింహ వాహన సేవ
నాలుగో రోజు వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ‘వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణం’ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ దివ్య కల్యాణాన్ని కళ్లారా వీక్షించి భక్తులు తరించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారికి అత్యంత విశిష్టమైన ‘సింహ వాహన సేవ’ నిర్వహించారు. సింహ వాహనంపై కొలువుదీరిన ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
పీఠాధిపతుల అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం
ఈ మహా యజ్ఞానికి కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ డా. నిర్మలానందనాథ మహాస్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతులు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ విచ్చేసి భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డా. ఎస్. అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ఆకట్టుకుంది. అనంతరం లక్షలాది దీపపు కాంతుల నడుమ సాగిన మహా నీరాజనం, స్వర్ణలింగోద్భవం, సప్త హారతులతో కోటి దీపోత్సవం నాలుగో రోజు వేడుకలు అద్భుతంగా ముగిశాయి. ఈ దీప యజ్ఞానికి విచ్చేసిన భక్తులందరికీ రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం యథావిధిగా పూజా సామగ్రిని ఉచితంగా అందజేసింది.
కోటిదీపోత్సవం-2026 4వ రోజు ఉత్సవంలో భాగంగా అమ్మవార్ల పల్లకీలన్నీ ఒకేసారి ఊరేగింపు..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/hBK7wA8iAf
— BhakthiTV (@BhakthiTVorg) November 17, 2026
కోటిదీపోత్సవం-2026 4వ రోజు ఉత్సవంలో భాగంగా వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవం..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/CMADMTvGWu
— BhakthiTV (@BhakthiTVorg) November 17, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!