బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీకి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. శుక్రవారం బీజేపీ పెద్దల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బిజీబిజీగా గడపుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌తోనూ భేటీ అయ్యారు.
ALso Read:Somu Veerraju: ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్… మూడు రోజులు హస్తినలోనే మకాం
తెలంగాణ, కర్ణాటకల్లో ఆఫ్ స్క్రీన్.. ఏపీలో ఆన్ స్క్రీన్ పాత్ర పోషించనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో టచ్ లోకి వెళ్లాలని కిరణ్ కు హైకమాండ్ బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం.
ALso Read:Accused Of Gang Raping: అత్యాచారం కేసులో 21 మంది పోలీసులు.. నిర్దోషులుగా విడుదల
ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పతో కిరణ్ భేటీ అయ్యారు. ఏపీలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. త్వరలో పార్టీలో చేయబోయే మార్పులు చేర్పుల్లో జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఏ మాత్రం వీలున్నా ఈలోగానే జాతీయ కార్సదర్శి పదవి కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది బీజేపీ హైకమాండ్. కిరణ్ తో కలిసి పని చేయాలని చెప్పేందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read:AP Congress : పన్ను బకాయిలు చెల్లించిన ఏపీ కాంగ్రెస్
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి మిషన్ సౌత్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ దళంలో చేర్చుకుంది. 64 ఏళ్ల కిరణ్ కుమార్ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కి చివరి సీఎం. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. రాజకీయంగా, ఆంధ్రప్రదేశ్‌లోని 16 మంది ముఖ్యమంత్రులలో 10 మంది రెడ్డిలు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గం చాలా ప్రముఖంగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య బిజెపి ఎన్నికల స్థానాన్ని సుస్థిరం చేయాలని భావిస్తున్నారు. కాగా, చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్న తాను పార్టీని వదులుకుంటానని తాను ఎప్పుడూ ఊహించలేదని కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.