Site icon NTV Telugu

Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా కిచ్చా సుదీప్

Suddep And Bommai

Suddep And Bommai

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. తాను కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనని, పార్టీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సుదీప్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరించారు. దీనిపై సీఎం బొమ్మై స్పందిస్తూ.. సుదీప్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడు కాదు.. నాకు మద్దతు ప్రకటించాడు. అంటే ఆ పార్టీకి (బీజేపీ) మద్దతిస్తున్నాడని అర్థం అని వ్యాఖ్యానించారు.

Also Read:Salaar 2: ఎన్టీఆర్ 31 వెనక్కి సలార్ 2 ముందుకి… ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్
మరోవైపు సుదీప్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరగ్గా.. ఆయనకు బెదిరింపు లేఖ కూడా వచ్చింది. బెదిరింపు లేఖపై, పంపినవారికి తగిన సమాధానం ఇస్తానని సుదీప్ పేర్కొన్నారు. బెదిరింపు లేఖ ఎవరు పంపారో తనకు తెలుసు అని అన్నారు. అది సినిమా పరిశ్రమలోని ఒకరి నుండి వచ్చిందని,తాను వారికి తగిన సమాధానం ఇస్తానని చెప్పారు. కష్ట సమయాల్లో తన పక్షాన నిలిచే వారికి అనుకూలంగా పని చేస్తానని సుదీప్ చెప్పారు.

Also Read:Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్

కిచ్చా సుదీప్ కాషాయ పార్టీలో చేరతారనే ఊహాగానాల మధ్య అతనికి బెదిరింపు లేఖ వచ్చింది. నటుడి మేనేజర్ లేఖ అందుకున్న తర్వాత, అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిచ్చా సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తి నుండి లేఖ వచ్చింది. మెసేజ్‌ని ఓపెన్ చేయగానే నటుడి ‘ప్రైవేట్ వీడియోలు’ విడుదల చేస్తామని బెదిరించే లేఖను చూసి మేనేజర్ షాక్ అయ్యాడు. దీంతో నటుడు మేనేజర్ పుట్టెనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. కాగా, కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న పోలైన ఓట్లను లెక్కించనున్నారు.

Exit mobile version