Salaar 2: ఎన్టీఆర్ 31 వెనక్కి సలార్ 2 ముందుకి… ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూనే తెరకెక్కనున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తో. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 31’ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో నటించబోతున్నాడు అనే వార్త బయటకి వచ్చింది. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న వార్ 2 మూవీలో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వార్ 2 సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో రెండు విషయాలకి క్లారిటీ ఇచ్చింది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావాల్సిన ‘ఎన్టీఆర్ 31’ మరింత డిలే అవనుంది, సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సలార్ షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పార్ట్స్ గా సలార్ ని రూపొందిస్తే KGF స్టైల్ లో బాక్సాఫీస్ ని రఫ్ఫాడేయ్యొచ్చు అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్, ప్రభాస్ అభిమానులు కోరుకునేది కూడా ఇదే. ప్రశాంత్ నీల్ సలార్ 2 కంప్లీట్ చేసే లోపు ఎన్టీఆర్ వార్ 2 సినిమాని కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఆన్ అవుతుంది. వార్ 2తో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ మరింత బలపడుతుంది, సలార్ 1&2తో ప్రశాంత్ నీల్ నార్త్ మార్కెట్ సాలిడ్ గా రెడీ అవుతుంది. అలాంటి టైమ్ లో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా పడితే బాక్సాఫీస్ ని బొమ్మ కనిపించడం గ్యారెంటీ.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?