ఏపీలో రూ.50కే కిలో మటన్..! ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు పండగరోజే.. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజునో మాంసం వండుకునేవారు.. కానీ, క్రమంగా మాంసానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది… వారానికి రెండు మూడు రోజులైనా మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే.. లేదా కనీసం సండే అయినా ముక్క ఉంటేనే ముద్ద దిగుతోంది.. ఏ ఫంక్షన్ అయినా.. ముక్క ఉంటేనే.. అది ఫంక్షన్ కింద లెక్క అనే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి.. అయితే, హైదరాబాద్ లాంటి సిటీల్లో కిలో మటన్ ధర ఏకంగా రూ.800కు చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క దగ్గర మాత్రం కేవలం రూ.50కే కిలో మటన్ చొప్పున విక్రయాలు జరిగాయి. దీంతో.. ఎగబడి మరీ మటన్ కొనుగోలు చేశారు వినియోగదారులు.
Read Also: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
రూ.50 కే కిలో మటన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వాల్మీకిపురంలో ఆదివారం రోజు కిలో మటన్ రూ.50గా పలికింది.. ఆదివారం సాయంత్రం వ్యాపారస్తుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. ఇలా విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది.. వాల్మీకిపురంలోని గాంధీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ మాంస విక్రయదారుడు మొదట కిలో మటన్ రూ.300గా విక్రయించాడు.. అయితే, ఇతర వ్యాపారస్తులు పోటీపడంతో.. అది కాస్తా రూ.200.. ఆ తర్వాత రూ.100.. ఇలా కిందకు దిగుతూ వచ్చింది.. చివరకు ఓ దుకాణాదారుడైతే కేవలం రూ.50కే కిలో మటన్ అంటూ.. విక్రయాలు సాగించాడట.. ఇలా వ్యాపారస్తులు పోటీ పడి.. చివరకు కిలో రూ.50కే విక్రయించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కొనుగోలుదారులు సైతం పోటీ పడడం.. ఒక్కొక్కరు కిలో, రెండు కిలోలు, ఐదు నుంచి పది కిలోల వరకు కొనుగోలు చేయడంతో రాత్రి 7.30 గంటల వరకే స్టాక్ మొత్తం అయిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే, గతం వారం రోజులుగా అక్కడ మాత్రం కిలో మటన్ రూ.400-500 పలకగా.. పోటీతో మాత్రం ఆ ధర అమాంతం దిగివచ్చింది.
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!