గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది… ప్రజాకవిగా తన స్వరం విప్పిన గోరటి వెంకన్న పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. తెలంగాణ యాశలో.. అడవి, పల్లెలు, అనగారిన వర్గాల బాధలే కాదు.. ప్రేయసిపై పాట రాసికూడా అందరినీ ఆకట్టుకున్నారు.. ఇప్పుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.. 2021 ఏడాదికి తెలుగు సాహిత్యంలో వల్లంకి తాళం కవితా సంపుటికి గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.. ఇక, తగుళ్ల గోపాల్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించగా.. దేవరాజు మహారాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు దక్కింది.
Read Also: మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
గోరటి వెంకన్న పాటకు పల్లె ప్రజలు, ప్రకృతి మూలాధారాలు.. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక, ఆయన సాహిత్యాన్ని, ఆయన పాటల్లోని మాధుర్యంతో పాటు.. ఎంతో విలువైన సూచనలను చూసి ముగ్ధుడైన సీఎం కేసీఆర్.. గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపారు.. 2020, నవంబర్‌లో శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు వెంకన్న.. సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు గోరటి వెంకన్న పాటలను సభావేదికలపై పాడిన సందర్భాలు ఉన్నాయి.. 1963లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించిన గోరటి వెంకన్న.. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.. చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చాడు. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడేవాడు.. ప్రజా సమస్యలపై కాదు.. కొన్ని సినిమాల కోసం కూడా వెంకన్న పాటలను రాశారు.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!