జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ తేదీన వనపర్తి జిల్లా పర్యటన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మరుసటి రోజు 20వ తేదీన జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
వీటితో పాటు, సీఎం కేసీఆర్ త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారని సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా.. అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపట్టనున్నారు. ఆ సందర్భంగా నియోజక వర్గం పరిథిలోని ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 100 పడకల దవాఖానకు శంఖు స్థాపన చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయ ప్రారంభంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే సందర్భంలో జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!