CM KCR: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ శాఖలు ఏర్పాటైనప్పటికీ.. మహారాష్ట్రపైనే ఎక్కువగా దృష్టి సారించింది.
సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ తేదీన వనపర్తి జిల్లా పర్యటన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మరుసటి రోజు 20వ తేదీన జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.…