NTV Telugu Site icon

నన్ను జైలుకు పంపి బతికి బట్టకడతావా.? : కేసీఆర్‌

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ఒకలా చెబితే… ఇక్కడ బండి సంజయ్‌ మరోలా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్‌ చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను జైలుకు పంపుంతా అన్న బండి సంజయ్‌ నన్ను జైలుకు పంపి బతికి బట్టకడతావా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను టచ్‌ చేసి చూడు ఏంటో తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. ఏనుగుల పోతుంటే కుక్కలు అరుస్తాయని ఇన్ని రోజులు ఊరుకున్నామన్నారు. ఇక నుంచి అవాక్కులు చవాక్కులు పేలితే.. సహించేది లేదన్నారు.