NTV Telugu Site icon

Karnataka: కర్ణాటకలో ఆ 17 వేల మంది ఓటర్లకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా?

Karnataka

Karnataka

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 17,000 మందికి పైగా ఉన్నారు.

Also Read:Nallapareddy Prasanna Kumar Reddy: ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి..! టీడీపీకి ఇదే నా సవాల్‌

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఇదే అత్యధికం. కర్ణాటకలో ఉన్న 12.15 లక్షల మంది ఓటర్లలో 80 ఏళ్లు పైబడి వారే అధికంగా ఉన్నారు. వీరిలో 16,976 మంది వందేళ్లు పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే, ఎన్నికల సంఘంలో 5.55 లక్షల మంది వికలాంగులు నమోదై ఉన్నారని ఈసీ తెలిపింది. కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే (VFH) సదుపాయాన్ని ఎన్నికల సంఘం గతంలో ప్రవేశపెట్టింది. కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

Also Read:Corona Cases: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్ఠానికి రోజువారీ కేసులు

రాష్ట్ర అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని అధికార బిజెపి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం వర్గానికి మత ఆధారిత రిజర్వేషన్‌ను రద్దు చేసింది ప్రభుత్వం. కన్నడిగుల సమస్య, లింగాయత్, వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.