అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది.
Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్
రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7 దేశాలు కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేశాయి. అయితే, ఉక్రెయిన్ కోసం అమెరికా దళాలను పంపే ఉద్దేశం లేదని, నాటో దేశాల్లోని తూర్పు సరిహద్దుల భద్రత కోసం అదనపు బలగాలను పంపాల్సి ఉంటుందని అన్నారు. ఉక్రెయిన్‌పై కయ్యానికి కాలుదువ్వితే రష్యాపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అమెరికా. రష్యా అద్యక్షుడు పుతిన్‌కు ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పినట్టు జో బైడెన్ స్పష్టం చేశారు.