ఇటీవలే జియో అందరికి షాకిస్తూ రూపాయికే 100 ఎంబీ డేటాను ప్రకటించింది. అదీ 30 రోజుల వ్యాలిడిటీతో. జియో తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో మొబైల్ కంపెనీలు షాక్ అయ్యాయి. సాధారణంగా ఏ కంపెనీ అయినా 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అందిస్తుంది. అయితే, జియో 30 రోజుల వ్యాలిడిటీలో రూపాయికు 100 ఎంబీ డేటాను అందిస్తామని చెప్పడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.
Read: భూమిలోపల వెయ్యికాళ్లజీవి… షాకైన శాస్త్రవేత్తలు…
జియో వినియోగదారులు డేటా ప్యాక్‌ను కొనుగోలు చేశారు. అయితే, జియో ఆ మరుసటి రోజే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రూపాయికి 100 ఎంబీ డేటా ఇస్తున్నా, 30 రోజుల వ్యవధికి కాకుండా ఒకరోజు కాలపరిమితికి చెల్లుబాటు అయ్యేవిధంగా డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ప్లాన్ ఛేంజ్ కాకముందు ప్యాక్ తీసుకున్నవారికి ముందు ఇచ్చిన ప్లాన్ కంటిన్యూ అవుతుందని జియో ప్రకటించింది.