Site icon NTV Telugu

Jagadish Shettar : “అవినీతి లింగాయత్ సీఎం”.. సిద్ధరామయ్యను సమర్థించిన జగదీష్ షెట్టర్

Jagadish Shettar And Siddar

Jagadish Shettar And Siddar

‘అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి’ అంటూ బసవరాజ్ బొమ్మైపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. అయితే, సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్ లో చేరిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత జగదీశ్ షెట్టార్ సమర్థించారు. కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్-సెంట్రల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా జగదీష్ షెట్టర్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల వేళ సిద్ధరామయ్య చేసిన “అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి” వ్యాఖ్యను ఆయన సమర్థించారు. ఈ వ్యాఖ్య ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని ఉద్దేశించి చేసిందని, అందరు లింగాయత్ సిఎంలపై కాదని షెట్టార్ చెప్పారు.

సిద్ధరామయ్య వ్యాఖ్య కేవలం ప్రస్తుత సీఎం బొమ్మైపైనే తప్ప అందరు లింగాయత్ సీఎంలపై కాదన్నారు. ఆయన ఇతర లింగాయత్ సీఎంలపై వ్యాఖ్యానించలేదని తెలిపారు. చాలా మంది లింగాయత్ నాయకులు బిజెపిని విడిచిపెట్టారని షెట్టార్ గుర్తుచేశారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అంటే ఈ ప్రాంత ప్రజలను దెబ్బతీయడం అని చెప్పారు. ఇది బిజెపి ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందన్నారు. హవేరి జిల్లాలోని బ్యాడగి తన నియోజకవర్గంలో లేదని, చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయమని తనను అడుగుతున్నారని షెట్టార్ చెప్పారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, ఒకటి రెండు రోజుల్లో వందలాది మంది అనుచరులు కూడా చేరతారని చెప్పారు.
Also Read: Opposition unity: ప్రధాని పదవి ఖాళీ లేదు.. మమత- నితీష్ భేటీపై బీజేపీ ఎద్దేవా

లింగాయత్ సీఎంలు అవినీతి చేశారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య కర్ణాటకను అవమానించడమేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లింగాయత్ ముఖ్యమంత్రులు అవినీతిపరులని చేసిన ప్రకటన ఖండించారు. ఇది కర్ణాటకను అవమానించడమేనని, దీనికి సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలని ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. లింగాయత్ కమ్యూనిటీ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఇమేజ్‌ను రూపొందించడంలో బిజీగా ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

కాగా, లింగాయత్ కమ్యూనిటీ నుండి అధికార బిజెపిని వదిలి వారంలోపే కాంగ్రెస్‌లో చేరిన రెండవ సీనియర్ నాయకుడు జగదీశ్ షెట్టార్. అంతకుముందు కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో షెట్టర్‌కు వ్యతిరేకంగా బిజెపి మహేష్ టెంగింకైని బరిలోకి దింపింది. మే 10న ఒకే దశలో 224 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో లింగాయత్ ఓట్లే చాలా కీలక కావడంతో ఆ సామాజిక వర్గం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది.

Also Read:Indian squad for WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన.. రహానేకు పిలుపు

Exit mobile version