'అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. అయితే, సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్ లో చేరిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత జగదీశ్ షెట్టార్ సమర్థించారు.
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 'అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో 52 మంది కొత్త వారిని టిక్కెట్లు కేటాయించడం చర్చనీయాంశమైంది. బిజెపి ఇతర పార్టీలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూనే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి అన్నారు.