ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. ఉత్తర సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు మోహరించాయి. దీంతో.. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దాడి చేయబోతున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో.. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడి మరింత తీవ్రతరం కానుంది. కాగా.. హిజ్బుల్లా రాకెట్ దాడులను కొనసాగిస్తే లెబనాన్ పరిస్థితి గాజా మాదిరిగానే ఉంటుందని ఇజ్రాయెల్ ఆర్మీ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘మేము హిజ్బుల్లాపై గాలి నుండి మరియు సముద్రం నుండి దాడి చేస్తున్నాము. ఇప్పుడు నేల దాడికి సిద్ధం కావాలి.’ అని తెలిపారు.
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబంపై కేసు..!
ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ దేశం యొక్క ఉత్తర సరిహద్దుకు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను తరలించాయి. అంతేకాకుండా.. రిజర్వ్ సైనికులను పిలవాలని కమాండర్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై పూర్తి శక్తితో దాడి చేస్తోందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తన లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం ఆపమని.. ఇజ్రాయెల్ విధానం స్పష్టంగా ఉందని నెతన్యాహు తెలిపారు. తాము పూర్తి శక్తితో హిజ్బుల్లాపై దాడి చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
Pakistan: పాకిస్థాన్‌లో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు.. 37 మంది మృతి
2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు
ఈ వారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 700 మంది చనిపోయినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులను తీవ్ర తరం చేసింది.. హిజ్బుల్లా యొక్క సైనిక సామర్థ్యాలను, సీనియర్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుంది. వాస్తవానికి.. హమాస్‌కు అనుకూలంగా ఉత్తర ఇజ్రాయెల్‌లోని హిజ్బుల్లా రాకెట్లు ప్రయోగించింది. దీంతో.. ఇజ్రాయెల్ ఎదురుదాడి ప్రారంభించింది. ఈ క్రమంలో.. అప్పటి నుంచి లెబనాన్‌లో 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతకు ముందు.. హమాస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడంతో.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.