International Women’s Day: ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” స్టోరీ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి’ అన్నారో కవి. స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు అని అర్థం. నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర వేస్తుంది స్త్రీ. కాగా.. రేపు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగామాట్లాడుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊరికే రాలేదు.. ఓ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన విషయం మీకు తెలుసా…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది. 1908లో 15,000 మంది మహిళలు ఇతర కొన్ని విషయాలతోపాటు మెరుగైన వేతనం, ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరం గుండా కవాతు చేశారు. 1910లో, జర్మనీలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీకి ‘మహిళా కార్యాలయం’ నాయకురాలిగా ఉన్న క్లారా జెట్కిన్ అనే మహిళ, మహిళల డిమాండ్ల కోసం ఒత్తిడి చేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రవేశపెట్టారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
- WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
- Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
- Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
17 దేశాల నుంచి 100 మందికి పైగా మహిళలతో జరిగిన సమావేశం ఏకగ్రీవ ఆమోదంతో జెట్కిన్ సూచనను ఆమోదించింది. 1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1913లో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీని మార్చి 8కి మార్చారు. ప్రతి సంవత్సరం అదే రోజున నిర్వహిస్తున్నారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మహిళా దినోత్సవాన్ని పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తారు. పర్పుల్ న్యాయానికి, హుందాతనానికి గుర్తు, పచ్చదనం ఆశావాదానికి, తెలుపు స్వచ్ఛతకు గుర్తు. ఈ రంగులను ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ ప్రతిపాదించిన మీదట యునైటెడ్ కింగ్ డమ్ కేటాయించింది. అప్పటి నుంచి శతాబ్దానికి పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.
వనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తాజావార్తలు
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
-
Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్‌కు పండగే!
-
Madurai Section 144: మధురైలో 144 సెక్షన్.. తిరుప్పరంకుండ్రం కొండపైకి భక్తులకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..