NTV Telugu Site icon

వాట్సాప్‌లో ఫైల్ పంపుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో వాట్సాప్ వినియోగించనివారే ఉండరు. ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో వాట్సాప్ ఉంటుంది. యూజర్లు వాట్సాప్‌ను పలురకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు చాటింగ్ కోసం ఉపయోగిస్తే మరికొందరు ఫోటోలు, వీడియోల కోసం వినియోగిస్తారు. అయితే వాట్సాప్‌లో డాక్యుమెంట్ రూపంలో ఏదైనా ఫైల్‌ను పంపేటప్పుడు సీరియల్ నంబర్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆ సీరియల్ నంబర్‌ను గమనించారా? ప్రతి సీరియల్ నంబర్ సుమారు 14 అంకెలను కలిగి ఉంటుందన్న విషయం మీకు తెలుసా?

Read Also: గాల్లో వేలాడుతున్న రైల్వే ట్రాక్.. నిలిచిపోయిన రైళ్లు

వాట్సాప్‌లో డాక్యుమెంట్ రూపంలో పంపే ఫైలులో కనిపించే నంబర్‌కు ఉండే 14 అంకెలు దేనిని సూచిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్సాప్‌లో ఎవరికైనా మనం ఎన్నిసార్లు ఫైల్ పంపిస్తే అన్ని సార్లు ఓ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్ డేట్, టైమ్‌ను తెలియజేస్తుంది. ఉదాహరణకు ఫైల్ నంబర్ 20210825_093436 ఉందని భావిస్తే… అందులో తొలి నాలుగు నంబర్లు ఇయర్‌ను సూచిస్తాయి. అంటే 2021 అనేది సంవత్సరం అన్నమాట. 0825 అనేవి నెల, తేదీని ఇండికేట్ చేస్తాయి. అండర్ స్కోర్ తర్వాత కనిపించే నంబర్లు గంటలు, నిమిషాలు, సెకన్లను తెలియజేస్తాయి. 09 అంటే గంటలు, 34 అంటే నిమిషాలు, 36 అంటే సెకన్లు. దీని అర్థం… 9 గంటల 34 నిమిషాల 36 సెకన్లకు మీరు ఫైల్‌ను పంపారని చూపించడం. ఈ విలువైన సమాచారాన్ని మీ సన్నిహితులకు కూడా షేర్ చేసి తెలియజేయండి.