NTV Telugu Site icon

World Bank: ఈ ఏడాది భార‌త ఆర్థిక వృద్ధి 7.5 శాతం పెరిగే ఛాన్స్..

India

India

ఈ సంవత్సరం భారత దేశ ఆర్థిక వృద్ధి 7. 5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గతంలఅో ఇదే ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలను ఆ బ్యాంక్ మార్చేసింది. అయితే, ఈ ఏడాది ద‌క్షిణాసియాలో ఆర్థిక వృద్ధి బ‌లంగా ఉంద‌ి.. అది 6.0 శాతం ఉంటుంద‌ని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భార‌త్‌లో ఆర్థిక వృద్ధి జోరుగా కొనసాగుతుంది. ఇక పాకిస్థాన్‌, శ్రీలంక దేశాల్లోనూ ఆశించిన దాని క‌న్నా ఎక్కువ స్థాయిలో రిక‌వ‌రీ కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొనింది. కాగా, సౌత్ ఏషియా డెవ‌ల‌ప్మెంట్ రిపోర్టులో ఈ విష‌యాన్ని బ్యాంక్ తెలిపింది. రాబోయే రెండేళ్లలో ద‌క్షిణ ఆసియాలో ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉంటుందని ఓ రిపోర్ట్ విడుదల చేసింది. 2025 నాటి సౌత్ ఏషియాలో వృద్ధి 6.1 శాతంగా ఉంటుంద‌ని వరల్డ్ బ్యాంక్ అంచ‌నా వేశారు.

Read Also: Summer: మధ్యాహ్నం బయటికి రావొద్దు.. ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన

అలాగే, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కారణంగా గాజాలో సుమారు 18.5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2022లో వెస్ట్‌బ్యాంక్‌, గాజా ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తిలో ఇది 97 శాతానికి సమానం అని చెప్పుకొచ్చింది. గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి గాజాలో ఆస్తి నష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది.