Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Records 3016 New Covid Cases In Past 24 Hours

Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు

Published Date :March 30, 2023 , 10:14 am
By NTV WebDesk
Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది. దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.యాక్టివ్ కేసులు 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా నమోదైంది.

దేశంలో కోవిడ్-19 కారణంగా 14 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,862కి పెరిగింది. మహారాష్ట్ర,ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌,కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ మరణాలు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వారం కోవిడ్ కేసుల భయంకరమైన పెరుగుదలపై అనేక రాష్ట్రాలు అత్యవసర సమావేశాలను నిర్వహించాలని యోచిస్తున్నాయి. జనవరి 16న ఇన్ఫెక్షన్ల సంఖ్య 0కి పడిపోయిన ఢిల్లీలో గత 24 గంటల్లో 300 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు సమావేశానికి ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లు, ఇతర వాటాదారులు హాజరుకానున్నారు.

Also Read: Amit Shah: రాహుల్ అనర్హత వేటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే మరియు సాంగ్లీ వంటి అనేక జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఇంకా కోటి మంది కూడా బూస్టర్ డోస్ తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

కాగా, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అధిక కరోనా పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పరీక్షలను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid 19
  • Covid Cases
  • india

తాజావార్తలు

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

  • DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • Andhra Pradesh New Map: అమరావతి రాజధానిగా.. 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌..

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions