భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 197 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇదే సమయంలో 19,446 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,08,996కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 3,34,78,247గా ఉంది.. మరోవైపు.. కోవిడ్ బారినపడి 4,52,651 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,78,098గా ఉన్నాయని కేంద్రం తెలిపింది.
ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 7,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా 77 మంది మరణించారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.15 శాతంగా ఉందని.. మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం అని ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.52 శాతానికి పడిపోగా.. మార్చి 2020 తర్వాత ఇదే అతితక్కువ కావడం మరో విశేషం.. ప్రస్తుతం 1,78,098 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 229 రోజుల తర్వాత ఇదే అత్యల్పం అంటోంది కేంద్ర ఆరోగ్యశాఖ. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది.. దేశవ్యాప్తంగా 41,36,142 టీకాల పంపిణీ జరగగా.. ఇప్పటి వరకు 99,12,82,283 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసిన భారత్.. వంద కోట్ల మార్క్‌కు మరింత చేరువైంది.