భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదవ్వగా ఒక్కరోజులో కొత్తగా 20 వేలకు పైగా కేసులు పెగరడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. ఇది అందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక 24 గంటల్లో 15,389 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా భారీగా పెరిగింది. 24 గంటల్లో కరోనాతో 534 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొన్నది. ప్రస్తుతం ఇండియాలో 2,14,004 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు మొత్తం 3,43,21,803 మంది కోలుకున్నారు.
Read: కరోనా టెర్రర్… మెడికల్ కాలేజీలో 143 మంది డాక్టర్లకు పాజిటివ్
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
ఇప్పటి వరకు 4,82,551 మంది కరోనాతో మృతిచెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. న్యూఇయర్ వేడుకల తరువాత కేసులు భారీగా నమోదవుతున్నాయి. వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. కొత్త సంవత్సరం వేడుకల తరువాత కేసులు మూడు రెట్లు వరకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్‌ను మరింత వేగంవంతం చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 147.72 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!