కరోనా టెర్రర్… మెడికల్ కాలేజీలో 143 మంది డాక్టర్లకు పాజిటివ్

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. బీహార్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని నలంద మెడికల్ కాలేజీలో సోమవారం 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడగా… తాజాగా మరో 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 143 మంది డాక్టర్లు కరోనాతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా ఆయా డాక్టర్లను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: సామాన్యుడిపై మరో భారం… పెరిగిన సిమెంట్ ధరలు

మరోవైపు కరోనా కట్టడికి బీహార్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. మంగళవారం నాడు బీహార్ వ్యాప్తంగా 893 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా… అందులో 565 కేసులు రాజధాని పాట్నాలోనే నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బీహార్‌ వ్యాప్తంగా పార్కులను ప్రభుత్వం మూసివేసింది. అటు రాజకీయ, మత సంబంధమైన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.

Related Articles

Latest Articles