Site icon NTV Telugu

సైదాబాద్‌ నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్..

హైదరాబాద్‌ నడిబొడ్డులోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… ఘటన జరిగి వారం కావస్తున్నా.. నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.. దీంతో.. హైదరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సైదాబాద్‌ చిన్నారి కేసుపై ఉన్నతస్థాయి నిర్వహించారు.. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది.. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. 10 పోలీసు బృందాలతో నిందితుడికోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఇదే సమయంలో.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆచూకీ తెలిపితే రూ.10 లక్షలు రివార్డ్‌ అందించనున్నట్టు ప్రకటించారు.. నిందితుడి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.. ఇక, ఆచూకీ తెలిపినవారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్.

Exit mobile version