ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం…చిత్తూరు జిల్లా జవాన్ సాయితేజ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. భారత ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన జవాను సాయితేజ్ ఉన్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
తమిళనాడు లోని కూనూరు సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. హెలీకాప్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఇయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికా రావత్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన 11 మంది జవాన్లలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్ ఉన్నట్లు ఆర్మీ ప్రకటించింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి

జిల్లాకు చెందిన సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ కు సాయితేజ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. సాయితేజ్ మృతితో ఎగువరేగడ గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలముకొన్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యుల కు తెలిపింది ఆర్మీ. ఉదయం 8.30 గంటలకు భార్యకు ఫోన్ చేశారు సాయి తేజ. సాయి తేజ భార్య పేరు శ్యామల. కొడుకు మోక్షజ్ఞ,కూతురు దర్శిని. తల్లి ఎగువరేగడ మాజీ ఎంపీటీసీ.సాయితేజ ఆకస్మికమరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తాజావార్తలు
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!