Site icon NTV Telugu

సండే స్పెష‌ల్‌: జాత‌ర‌ను త‌ల‌పిస్తున్న విశాఖ ఫిషింగ్ హార్బ‌ర్‌…

ఆదివారం కావ‌డం వ‌ల‌న విశాఖ‌లోని నాన్ వెజ్ మార్కెట్లు, దుకాణాలు కిత‌కిత‌లాడుతున్నాయి.  సాధార‌ణ రోజుల్లో నాన్ వెజ్ మార్కెట్లకు ఎలా వెళ్లినా పెద్ద‌గా ఇబ్బందులు లేవు.  కానీ, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.  ప్ర‌జ‌లు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్ల‌వ‌ద్ద‌ని, మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌ని, భౌతిక‌దూరం పాటించాల‌ని ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు జారీ చేస్తున్నా అవి ఎంత మాత్రం అమ‌లు కావ‌డం లేదు.  నాన్ వెజ్ మార్కెట్లలో సోష‌ల్ డిస్టెన్స్ క‌నిపించ‌డం లేదు.  

Read: లైవ్‌: అల్లూరి సీతారామ‌రాజు 125 వ జ‌యంతి వేడుక‌లు

నిబంధ‌న‌లు గాలికి వ‌దిలేసి జ‌నం తిరుగుతున్నారు.  మాస్కులు లేకుండా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు.  ఇక‌, ఆదివారం రోజున విశాఖ‌లోని ఫిషింగ్ హార్బ‌ర్ జాత‌ర‌ను త‌ల‌పిస్తోంది.  నిబంధ‌న‌లు పాటించ‌కుంటే భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు అమ‌లు చేస్తున్నారు.  దేశంలో థ‌ర్డ్ వేవ్ సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని అధికారులు మొత్తుకుంటున్నా ప్ర‌జ‌లు ఖాత‌రు చేయ‌కుండా బ‌య‌ట తిరుగుతున్నారు. 

Exit mobile version