ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా ఆదివారం వరకు కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వరకు మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి తెలిపారు. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు,రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఉరుములు,వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం అమరావతి, విజయవాడ, తాడేపల్లి తదితర రాజధాని ప్రాంతంలో మేఘావృతమై కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు గండిపోసమ్మ ఫెర్రీ పాయింట్ల వద్ద బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశారు.
Also Read: MLC Elections Results: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా.. ఇద్దరు అభ్యర్థుల గెలుపు
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల ఈ వర్షలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొన్న సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో వికారాబాద్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా చాలా పంటలు వర్షంతో దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డిలో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.