Site icon NTV Telugu

Covid Alert: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. వైద్యారోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్

Covid

Covid

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN -1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN – 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి , డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Special Trains: తెలంగాణ నుండి అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లు..

కాగా.. ఇండియాలో కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కేసులు 21 నమోదయ్యాయి. ఎక్కువగా గోవాలో 19 కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల కేరళలో JN.1 వేరియంట్‌ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్.. అత్యంత వేగం వ్యాప్తి చెందడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Pallavi Prashanth Arrested: బిగ్ బ్రేకింగ్: పల్లవి ప్రశాంత్ అరెస్ట్

Exit mobile version