తెలంగాణలో రేపటి(మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చి తొలి వారంలోనే వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ బడుల్లో 12.30 గంటలకు తప్పనిసరిగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించింది.
Also read:Arvind Kejriwal: రాజస్థాన్‌పై ఆప్ గురి.. బీజేపీ, కాంగ్రెస్ సంగతేంటి?
ఇక, పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ ఉత్వర్తుల్లో పేర్కొంది. పదోతరగతి పరీక్ష కేంద్రాల బడుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తెలిపింది. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నందున ప్రత్యేక తరగతులను కొనసాగించాలని ఆదేశించారు. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్కి సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. ఎస్‌ఎస్‌సీ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని సర్క్యులర్‌లో పేర్కొంది.
Also read:Rain Alert: తెలంగాణలో మూడు రోజుల్లో వర్షాలు