NTV Telugu Site icon

H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్

H3n2 Virus

H3n2 Virus

దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని మరువకముందే మరో వణికిస్తోంది. దేశంలో వైరస్ హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హెచ్3ఎన్2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు, ఊపందుకున్న పర్యాటకం వెరసి..హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా వెల్లడించాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో హెచ్3ఎన్2 రకం వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైంది. సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.

Alsor Read: TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం విదేశీయులు క్యూకట్టడం, పర్యాటకం కూడా ఊపందుకున్న నేపథ్యంలో హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు మాస్కులు వాడటం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 21 హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుఎంజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తిరుపతిలోని వీఆర్‌డీఎల్‌లో నిర్వహించిన పరీక్షల్లో జనవరిలో 12, ​​ఫిబ్రవరిలో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. హెచ్‌3ఎన్2 అనేది ఇన్‌ఫ్లుఎంజా ఎ టైప్ వేరియంట్ వల్ల వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్ అని, ఇది శ్వాసనాళంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ జనసమూహంలో తిరడం లేదా తరగతి గదులు, కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారిని ప్రభావితం చేస్తుంది. ఇది సోకిన వ్యక్తి ద్వారా దగ్గు లేదా తుమ్ము ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారిలో జ్వరం,దగ్గు,గొంతునొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయి వైద్యులు చెబుతున్నారు.

Alsor Read: Jana Sena: వారాహి ఆగదు.. పవన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

మరోవైపు తెలంగాణలో కేసులు మరింత పెరిగిన పక్షంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలనే యోచనలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం కూడా పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ‌తో హెచ్3ఎన్2 వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రక్తనమూనాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపిస్తున్నట్టు ఫీవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. కేసులు సంఖ్య పెరిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఫీవర్ ఆసుపత్రితో పాటూ వరంగల్, ఆదిలాబాద్‌లోనూ ప్రారంభిస్తామని చెప్పారు. కొవిడ్, చికున్‌గున్యా నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించిన ఎక్విప్‌మెంట్‌‌తోనే హెచ్3ఎన్2 వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్టు వెల్లడించారు.